News

ఇమ్రాన్ ఖాన్ డౌన్‌… డౌన్‌!

640views
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్‌లో భారీ నిరసనలు

క‌రాచీ: పాకిస్థాన్​లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన బాట పట్టారు. వేలాది మంది ప్రజలు కరాచీ వీధుల్లో కదం తొక్కారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు వేలాది మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్‌ ధరలు భారీగా పెరిగాయని ఇమ్రాన్‌ఖాన్‌ తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వందలాది మంది కార్మికులు ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా రాసిన బ్యానర్లను కార్మికులు ప్రదర్శించారు. పేదలకు రోజుకు రెండు పూటలా భోజనం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ అనర్హుడని జమియత్ ఉలేమా ఇ ఇస్లాం సంస్థ నేత రషీద్ సూమ్రో అన్నారు. దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌కు తెలియదని.. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి