News

భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుంది

518views
  • ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: భాషను మరిచిపోతే సంస్కృతీ దూరమవుతుందని, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగులోని అనంత సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతలను- తెలుగుభాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలని పిలుపునిచ్చారు. 2020 అక్టోబరులో జరిగిన ప్రపంచ తెలుగు సదస్సులోని అంశాలను మేళవించి ‘వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ రూపొందించిన 100వ తెలుగు గ్రంథాన్ని ఆయన అదివారం దిల్లీ నుంచి అంతర్జాలం ద్వారా ఆవిష్కరించి ప్రసంగించారు. దాన్ని దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేయడాన్ని, అలాగే 2 ఏళ్లుగా నిరంతరం తెలుగు భాష సదస్సులను నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్‌ను అభినందించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి