News

అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా రహదారి నిర్మాణం

556views
  • మండిప‌డ్డ భారత్

ఇటానగర్: అరుణాచల్​ప్రదేశ్​కు సమీపంలో, టిబెట్​లోని బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్​ నిర్మించేందుకు చైనా వేసిన ప్రణాళికలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా.. ఈ ప్రాంతానికి సమీపంలో ఓ వ్యూహాత్మక రహదారి నిర్మాణ పనులను చైనా పూర్తి చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతంలో ఉన్న రహదారిగా అభివర్ణించింది.

6,009 మీటర్ల గ‌రిష్ఠ‌ లోతుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతమైన యార్లుంగ్ జాంగ్​బో గ్రాండ్ లోయ వెంబడి.. 310 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన రహదారి గత శనివారం పూర్తయినట్టు చైనా అధికార వార్తా సంస్థ వెల్లడించింది. న్యిన్​గ్చి, మెడాగ్​ను జోడిస్తూ జరిగిన 67.22 కిలోమీటర్ల నిర్మాణంతో రహదారి పనులు ముగిసినట్టు తెలిపింది. అరుణాచల్​ ప్రదేశ్​కు సమీపంగా, టిబెట్​లోని చివరి కౌంటి ఈ మెడాగ్​ కావడం గమనార్హం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి