
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు సుదీర్ఘంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఢిల్లీలోని సింఘు సరిహద్దులో (కుండ్లి, సోనిపట్‌లో) ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది.
చేయి, మెడ నరికేసిన ఓ 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి శవం ఢిల్లీలో ఈ ఉదయం (అక్టోబర్ 15) పోలీస్ బారికేడ్ కు వ్రేళ్ళాడుతూ కనిపించింది.
దానికి ముందు కొందరు నిహంగ్ సిక్కులు ఒక వ్యక్తిని చుట్టుముట్టి అతనిపై దాడి చేసి అతని చేతులు నరుకుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దాంతో ఈ హత్య రైతు నిరసనకారులలోని కొందరి పనేనని పోలీసులు భావిస్తున్నారు.
వారు ముందుగా అతని చేతులు నరికేశారు. మెడ కోశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడికి సమీపంలోని పోలీస్ బారికేడ్ కు వేలాడదీశారు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ ను అపవిత్రం చేశాడనే ఆరోపణతో నిహంగులు ఆ యువకుడిని (ఇంకా గుర్తించలేదు) కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది.
గత సంవత్సరం కోవిడ్ లాక్ డౌన్ సమయంలో పాటియాలాలో పాసులు చూపించమని అడిగిన ఒక పోలీసు అధికారి చేతిని కొంతమంది నిహంగ్ సిక్కులు నరికేసిన ఘటన కూడా అప్పట్లో సంచలనం రేపింది.
ఇకపోతే వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనల వేదిక నేర కార్యకలాపాల కేంద్రంగా మారింది.
గత సంవత్సరం వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనకారులకు సంఘీభావం తెలిపేందుకు కోల్కతా నుంచి వచ్చిన ఒక బాలిక కొందరు దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురైంది. అనంతరం బాధితురాలు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది.
మరొక సంఘటనలో….. వ్యవసాయ చట్టాల వ్యతిరేక నిరసనకారులు ఒక యువ రైతును కాల్చి చంపారు.
Source : Organiser.





