News

ఆ మృతులు ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుడు!

655views
  • ముస్లింలను వేరు చేసి, హిందువులను కాల్చిన ముష్కరులు

జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో మృత్యువాత పడిన వారు సంగం సఫకదళ్‌లో ఉన్న బాయ్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు హిందూ టీచర్లు. జమ్మూ కశ్మీర్‌లో తాజాగా ఇద్దరిని ముష్కరులు బలితీసుకున్న విషయం విదితమే. కాశ్మీర్‌ లోయలోని శ్రీనగర్‌లో ఉన్న ఈ పాఠశాలలో గురువారం ఈ దుర్ఘటన సంభవించింది. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు టీచర్లకు గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాని తరువాత వారు మృతి చెందారు. వారిలో ఒకరు ప్రిన్సిపాల్‌ సుఖ్వీందర్‌ కౌర్‌, రెండో వ్యక్తి ఉపాధ్యాయుడు దీపక్‌. ప్రిన్సిపాల్‌ ఆఫీసులో నలుగురు ఐదుగురు టీచర్లు సమావేశం అవుతుండగా కనీసం ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉగ్రవాదులు ముస్లిం టీచర్లను గ్రూప్‌ నుండి వేరు చేసి, ప్రిన్సిపాల్‌ సహా ఇద్దరు హిందూ టీచర్లను పాఠశాల భవనం నుండి బయటకు లాగారు. అనంతరం వారు స్కూల్‌ కాంపౌండ్‌లో వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి