News

‘అక్షర రథయాత్ర’పై జిహాదీల గావుకేకలు!

552views
  • ఆన్‌లైన్‌ వేదికగా జాతీయవాద ముస్లింపై విమర్శలు

తిరువనంతపురం: కేరళలో జిహాదీల గావుకేకలు ఆగడం లేదు. ఏ కార్యక్రమమైనా ఏ మాత్రం వారికి నచ్చకపోయినా చిందులేయడం పరిపాటిగా మారింది. వివరాలివి. భారత స్వాతంత్య్ర డెబ్బై ఐదవ వార్షికోత్సవంలో భాగంగా కేరళలో కేసరి వీక్లీ, కోజికోడ్‌, ‘అక్షర రథ యాత్ర’ను నిర్వహించింది. కన్యాకుమారి నుండి కోళికోడ్‌ వరకు ఊరేగింపు జరిపింది. రథయాత్రను వివేకానంద కేంద్రం కన్యాకుమారి ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ నివేదిత భిడే జెండా ఊపి ప్రారంభించారు.

కన్యాకుమారి శిల్పులు నల్ల గ్రానైట్‌తో చెక్కిన సరస్వతి దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి కేసరి భవన్‌ కోజికోడ్‌లో ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ఠ తరువాత తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి పండుగ ఈ నెల ఏడోతేదీ నుండి అక్టోబర్‌ 15 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించనున్నారు.

అక్షర రథయాత్రకు భారీ స్వాగతం

రాష్ట్ర నలుమూలల నుంచి అక్షర రథయాత్రకు భారీ స్వాగతం లభించింది. నాలుగు రోజుల ఊరేగింపును కేరళలోని ప్రధాన దేవాలయాలు, ఆశ్రమాలతో సహా 100కి పైగా కేంద్రాలు ఘనంగా స్వాగతం పలికాయి. కేసరి మీడియా రీసెర్చ్‌ సెంటర్‌లో కొత్తగా నిర్మించిన లైబ్రరీ కోసం యాత్రను పురస్కరించుకుని నిర్వాహకులు వివిధ వ్యక్తుల నుండి పెద్ద సంఖ్యలో పుస్తకాలను సేకరించారు. అనేక మంది ప్రముఖ వ్యక్తులు, పండితులు వారి రాజకీయ, మతపరమైన సంబంధాలతో సంబంధం లేకుండా వివిధ కేంద్రాలలో జరిగిన ఈ సాంస్కృతిక ఊరేగింపులో పాల్గొన్నారు.

సరస్వతి దేవి విగ్రహానికి హారతి ఇచ్చిన ముస్లిం

కోజికోడ్‌ జిల్లాలోని పంతీరాంకావ్‌ వద్ద ఊరేగింపు చివరి రోజున యాత్రను జాతీయవాద ముస్లిం, లక్షద్వీప్‌ ఆధారిత సముద్ర శాస్త్రవేత్త పద్మశ్రీ అలీ మాణిక్‌ ఫ్యాన్‌ స్వాగతించారు. అతను సరస్వతి విగ్రహానికి హారతి ఇచ్చి, గ్రంథాలయానికి పుస్తకాలను విరాళంగా ఇచ్చారు.

సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ!

విగ్రహం ముందు హారతి ఇస్తున్న అలీ మాణిక్‌ ఫ్యాన్‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఇస్లామిక్‌ జిహాదీ ఫండమెంటలిస్టులు, స్వార్థపరశక్తులు అలీ మాణిక్‌కు తీవ్రంగా విమర్శించాయి. ఆన్‌లైన్‌ వేదికగా దాడి చేయడం ప్రారంభించాయి. ఈవెంట్‌ను నాన్‌స్లామిక్‌ అని చిత్రీకరించారు. అతనికి వ్యతిరేకంగా చాలా పోస్టులు వచ్చాయి.

ఫేస్‌బుక్‌లో క్షమాపణ

జిహాదీల నుండి విపరీతమైన ఒత్తిడి ఫలితంగా, యాత్రలో పాల్గొన్నందుకు క్షమాపణలు కోరుతున్నట్టు అలీ ప్రొఫైల్‌ నుండి ఫేస్‌బుక్‌ పోస్ట్‌ కనిపించింది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా తన అనుచరులకు క్షమాపణలు చెప్పారు. జిహాదీల వెర్రికేకలు కేరళలోని ప్రమాదకరమైన పరిస్థితికి అద్దంపడుతున్నాయి.

 ఇస్లామిక్‌ మీడియా పండగ

భారత స్వాతంత్య్ర డెబ్బై ఐదవ వార్షికోత్సవానికి సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం, లైబ్రరీ కోసం పుస్తకాలను సేకరించడం కోసం ఒక జాతీయవాద ముస్లింపై ఇలా దాడికి పాల్పడడం, తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని జాతీయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచ క్రీడా పోటీల్లో గోల్డ్‌మెడల్‌ కొట్టినంతగా ‘క్షమాపణ’ను ‘మధ్యమం’ అనే ఇస్లామిక్‌ మీడియా పండగ చేసుకుంది.

జాతీయత, జాతీయవాద ఆదర్శాల పట్ల గౌరవం ఉన్న ఒక ముస్లిం కూడా కేరళలో మతోన్మాదులకు భయపడవలసి వచ్చింది. ఈ చర్య కేరళను ఇస్లామిక్‌ రాష్ట్రంగా మార్చేందుకు జిహాదీలు చేస్తున్న కుట్రకు సాక్ష్యంగా నిలిచిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

Source: VskKerala

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి