News

దమ్ముంటే నా ముందుకు రండి… ముష్కరులకు కశ్మీరీ పండిట్‌ కుమార్తె సవాల్‌!

230views

కశ్మీర్‌: ఇక్బాల్‌ పార్క్‌లోని బింద్రూ మెడికేట్‌ ఫార్మశీ యజమాని కాశ్మీరీ పండిట్‌ అయిన లాల్‌ బింద్రూ(70)ను ఉగ్రవాదులు హతమార్చిన విషయం విదితమే.
మక్కన్‌ లాల్‌ బింద్రూ చిన్న కుమార్తె డాక్టర్‌ శ్రద్ధా బింద్రూ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రిని చంపిన గుర్తు తెలియని ఉగ్రవాదులకు సవాల్‌ విసిరింది. రాళ్లు రువ్వడం.. ఇలా హింసకు తెగబడడం ఉగ్రవాదులకు చేతనయ్యే పని ఇదేనని ఆమె తెలిపింది.

‘నేను అసోసియేట్‌ ప్రొఫెసర్‌, నా సోదరుడు ప్రముఖ డయాబెటాలజిస్ట్‌, మా అమ్మ మా దుకాణం నడుపుతోంది. మా నాన్న ఏమి లేని స్థాయి నుండి మొదలుపెట్టాడు.. మమ్మల్ని ఓ మంచి స్థాయిలో ఉంచారు. ఈ వ్యక్తులు(తీవ్రవాదులు) శరీరాన్ని మాత్రమే చంపగలరు, కానీ ఆత్మను చంపలేరు. తెలివైన చర్చలు చేయలేరు. రాళ్లు విసరడం, వెనుకనుండి వచ్చి కాల్చడం తప్ప ఏమీ చేయలేరని’ ఆమె తెలిపారు. ‘మీకు ధైర్యం ఉందని మీరు అనుకుంటే, వచ్చి మా ముందు కూర్చుని చర్చించండి. నేను కూడా కశ్మీర్‌ పండిట్‌ బిడ్డను వచ్చి నన్ను ఎదుర్కోండి’ అంటూ కెమెరా ముందు సవాల్‌ విసిరింది.

అక్టోబర్‌ 5న జమ్మూ కశ్మీర్‌లో ఇస్లామిక్‌ ఉగ్రవాదులు ముగ్గురు అమాయక పౌరులను చంపారు. బింద్రూ కాకుండా, వీరేంద్ర పాశ్వాన్‌ అనే వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. అతను భాగల్‌పూర్‌కు చెందినవాడు.. ఆలంగారి బజార్‌ జాడిబాల్‌ ప్రాంతంలో ఉండేవాడు. మహ్మద్‌ షఫీ లోన్‌ అనే వ్యక్తిని కూడా చంపేశారు. ఉత్తర కశ్మీర్‌లోని బందిపూర్‌లోని షాగుండ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి