News

క్షతగాత్రులను తొలిగంటలో ఆస్పత్రికి తరలిస్తే రూ. 5 వేలు

426views
  • ఉత్తమ ప్రాణదాతలకు రూ. లక్ష

  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఈ నెల 15 నుంచి అమలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడిరచింది. ప్రమాదాల్లో గాయపడిన వారిని తొలి గంట(గోల్డెన్‌ అవర్‌)లో ఆసుపత్రికి తరలించి, ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది.

ఈ పథకం అక్టోబరు 15 నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.1 లక్ష చొప్పున అందిస్తారు. ఈ పథకంలో ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే, ఆ వివరాలను వైద్యులతో ధ్రువీకరించుకున్న అనంతరం పోలీసులు ఆ వ్యక్తికి ఓ రసీదు ఇస్తారు. ఆ రసీదు కాపీని కలెక్టర్‌ నేతృత్వంలో పనిచేసే ఓ కమిటీకి పోలీసులే పంపిస్తారు.

రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే, వారి పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కేంద్రం తాజా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికే కేంద్రం వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి