
-
షారుఖ్ ఖాన్‌ని కలవడానికి వెళ్ళిన సల్మాన్‌ఖాన్
ముంబై: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం నుంచి విచారించగా ఆధారాలు లభించడంతో ఈ చర్యకు పూనుకొన్నారు. అతడితో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ ఖాన్‌ను కోర్టులో హాజరుపరచగా అతడిని ఒకరోజు ఎన్‌సీబీ కస్టడీకి పంపారు. ఈ ఘటన తర్వాత షారుఖ్ ఖాన్‌ని కలవడానికి సల్మాన్‌ఖాన్ మన్నాత్ చేరుకున్నారు.
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత, సల్మాన్ ఖాన్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ బంగ్లాకు చేరుకున్నారు. కాగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) శనివారం సాయంత్రం ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌పై దాడి చేసి డ్రగ్స్ పార్టీ చేస్తున్న చాలా మందిని అరెస్టు చేసింది. అందులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ విహారయాత్రలో రేవ్ పార్టీ జరుగుతుండేది.
Source: Tv9





