News

భారత తీరంలో బంగ్లా నౌక

581views

విశాఖపట్నం: విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి(ఈఎన్‌సీ) చెందిన జెట్టీలోకి బంగ్లాదేశ్‌కు చెందిన నౌక ‘బీఎన్‌ఎస్‌ సముద్ర అవిజన్‌’ చేరుకుందని నేవీవర్గాలు వెల్లడిరచాయి. ఇండో- పాక్‌ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తవడంతో చేపడుతున్న స్వర్ణ విజయ్‌వర్ష్‌ వేడుకల్లో భాగంగా ఈ నౌక భారత్‌లో అయిదు రోజుల పాటు పర్యటించి… ఇక్కడి నౌకాదళంతో మమేకమవుతుందని పేర్కొన్నాయి.

బంగ్లాదేశ్‌ జాతీయ నేత బహదూర్‌ షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ శత జయంతి స్మారకంగా భారత్‌ నేవీతో వృత్తిపరమైన మమేకం, క్రాస్‌డెక్‌ వంటి అంశాలతో భాగస్వామ్యం కానుందని స్పష్టం చేశాయి. తొలుత జెట్టీ వద్ద నౌకకు భారత్‌ నేవీ బ్యాండుతో సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం ఈఎన్‌సీ చీఫ్‌, వైస్‌ అడ్మిరల్‌ ఏబీ సింగ్‌తో బంగ్లాదేశ్‌ నౌక సీవో భేటీ అయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి