News

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు

588views

శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు మళ్లీ ఈరోజు ఉదయం తాకాయి. ఉదయం ఏడు నిమిషాలు, శుక్రవారం రోజు తొమ్మిది నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించాయి. ఆ అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.

ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ ఆలయంలో ఆనవాయితీ. మళ్లీ అక్టోబర్‌ 1,2 తేదీల్లోనూ ఈ అపురూప దృశ్యం సాక్షాత్కారం అవుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో చోటుచేసుకునే ఈ అద్భుతాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి