News

శ్రీలంకలో తెలుగు శాసనం లభ్యం

654views

కొలంబో: శ్రీలంకలో వాయువ్య, తూర్పు ప్రావిన్సులు కలిసే చోట తెలుగు, తమిళం భాషల్లో రాసిన తెలుగు రాగి శాసనం లభ్యమైందని జాఫ్నా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగ అధిపతి ప్రొఫెసర్‌ పి.పుష్పరత్నం వెల్లడిరచారు. తమిళ సంప్రదాయ మూలాలు శ్రీలంకలో ఉన్నాయనడానికి ఈ ప్రత్యేకమైన శాసనం ఆధారం అని ఆయన చెప్పారు. రాగి శాసనం లభ్యమైన ప్రాంతం, పొలోన్నరువా, బట్టికలోవా ప్రధాన రహదారికి పక్కనే ఉంది. ఇది చరిత్ర ప్రాముఖ్యం ఉన్న ప్రాంతం. తంబంకాడులోని చిత్రవేలాయుధర్‌ ఆలయంలో ఈ రాగి శాసనాన్ని కనుగొన్నారు.

ప్రొఫెసర్‌ పి. పుష్పరత్నం చెబుతున్న ప్రకారం ఇది శూలం(సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం) చిహ్నాన్ని కలిగి ఉన్న ఆలయం. ఆలయ పునరుద్ధరణ సమయంలో దొరికిన పాత ఆలయ అవశేషాలు, పూజా సామగ్రిలను, ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక స్థలంలో సురక్షిత ప్రాంతంలో ఉంచారు. భద్రపరచిన స్తంభాల్లోని ఒకదానిలో ఈ కాంస్య శాసనం లభ్యమైంది. రాగి పూతతో అలంకరించిన ఆ స్తంభం ఆలయంలోని ప్రధాన మందిర గదిలోని భాగం.

ఈ అయిదు అడుగుల పొడవున్న స్తంభంపై రాగి పూత అమర్చి ఉంది. స్తంభం ప్రారంభంలో, చివరలో అర్ధ వృత్తాకార తామర పుష్పాలు చెక్కి ఉన్నాయి. మధ్యలో ఉన్న కమలానికి ఎడమ వైపు తెలుగులో, కుడి వైపు తమిళంలో రాసి ఉంది. శ్రీలంకలో నివసిస్తూ తెలుగు మాతృభాషగా ఉన్న వ్యక్తుల చరిత్ర ఇది. శ్రీలంకలో కాండీ పాలనకు ముందు, తెలుగు మాతృభాషగా ఉన్న వ్యక్తులు అక్కడ నివసించినట్టు ఆధారాలు లభించాయని ప్రొఫెసర్‌ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి