News

మహిళా అధికారులను సైన్యం నుంచి తొలగించొద్దు

624views

సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: తదుపరి విచారణ జరిగే వరకు మహిళా అధికారులను సైన్యం నుంచి తొలగించవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం సైన్యాన్ని ఆదేశించింది. 72 మంది మహిళా షార్టు సర్వీసు కమిషన్‌ అధికారులను పర్మినెంట్‌ కమిషన్‌ అధికారులుగా తీసుకోవడానికి సైన్యం నిరాకరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ బివి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్మినెంట్‌ కమిషన్‌కు వారి పేరును ఎందుకు పరిశీలించలేదో వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని సైన్యాన్ని ఆదేశించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి