
న్యూఢిల్లీ: కిసాన్ పంచాయత్‌కు చీవాట్లు పెట్టింది సుప్రీం కోర్టు. జాతీయ రహదారులను నిర్బంధించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడిరది. కోర్టును ఆశ్రయించినప్పుడు నిరసన చేపట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. నిరసన తెలిపే హక్కు రైతులకు కచ్చితంగా ఉంది.. కానీ రహదారులను నిర్బంధించడం సరికాదని పేర్కొంది. జంతర్ మంతర్ వద్ద ధర్నా కోరుతూ కిసాన్ మహా పంచాయత్ దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం.
అయితే, తాము రహదారులపై బైఠాయించిన రైతుల ధర్నాలో భాగం కాదని కోర్టుకు తెలిపింది కిసాన్ మహా పంచాయత్. జంతర్ మంతర్ వద్ద తాము సత్యాగ్రహం తెలుపుతామని వెల్లడిరచింది. కిసాన్ పంచాయత్ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం.. ముందు మీరు రైతుల ధర్నాలో భాగం కాదంటూ రాతపూర్వకంగా అఫిడవిట్ దాఖలుచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
Source: Tv9





