News

చైనాతో ఒప్పందం కుదిరే వరకు ఘర్షణలు తప్పవు

725views
  • భారత సైన్య అధ్యక్షుడు నరవాణే

న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య ఒప్పందం కుదిరే వరకూ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే అన్నారు. అఫ్ఘానిస్థాన్లోని తాజా పరిణామాలపై భారత ఆర్మీ దృష్టి సారిస్తూనే ఉంటుందని, ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలు రూపొందిస్తుందని చెప్పారు. ఢిల్లీలో పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చైనాతో సరిహద్దు సమస్య అపరిష్కృతంగానే ఉందని, ఎటువంటి దుస్సాహసం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి