News

బలూచిస్తాన్‌లోని హింగ్లాజ్‌ ఆలయాన్ని పునరుద్ధరించండి

715views

అసొం: దుర్గా పూజ (దుర్గోత్సవ్‌ లేదా శరోదత్సవ్‌ అని కూడా పిలుస్తారు) వచ్చే నెల (11-15 అక్టోబర్‌ 2021) ప్రారంభం కానున్నందున, ఈశాన్య భారతదేశానికి చెందిన జాతీయవాద పౌరుల ఫోరం బలూచిస్థాన్‌లో ఉన్న శక్తి పీఠమైన హింగ్లాజ్‌ మాత మందిరాన్ని పునరుజ్జీవింపజేయాలని కోరింది.

దేశభక్తి గల పీపుల్స్‌ ఫ్రంట్‌ అస్సాం(పిపిఎఫ్‌ఎ) ఒక ప్రకటనలో ఈ విషయమై ఢల్లీిలోని కేంద్ర ప్రభుత్వం బలూచిస్తాన్‌ అధికారులతో కలిసి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరింది.

హింగోల్‌ జాతీయ ఉద్యానవనం లోపల హింగోల్‌ నది ఒడ్డున ఉన్న పర్వత గుహలోని హింగ్లాజ్‌ మాత ఆలయం, పాకిస్తాన్‌ నైరుతి భాగంలో అరేబియా సముద్రం మక్రాన్‌ తీరానికి ఆనుకొని ఉంది. కరాచీకి వాయువ్యం దిశలో 250 కిమీ దూరంలో ఉంది. హిందువులకు ఇది గౌరవనీయమైన ప్రదేశం. శక్తి దేవిని సాంప్రదాయ రీతిలో ప్రార్థించడం కోసం అక్కడ వేలాది మంది విచ్చేస్తుంటారు.

ప్రముఖ బలూచ్‌ జాతీయవాద నాయకుడు హైర్‌బైర్‌ మర్రి, ఇటీవల పిపిఎఫ్‌ఎతో మాట్లాడినప్పుడు బెలూచిస్తాన్‌ను ఆక్రమించిన పాకిస్తాన్‌ దళాల ఉదాసీన వైఖరి కారణంగా హింగ్లాజ్‌ మాత ఆలయం దయనీయ స్థితిలో ఉందని పేర్కొన్నారు.

స్వేచ్ఛా బలూచిస్తాన్‌ ఉద్యమ అధ్యక్షుడు మాట్లాడుతూ, బలూచ్‌ ప్రజలు ఎక్కువ మంది ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ, ఈ మందిరం పట్ల వారికి చాలా గౌరవం ఉందని చెప్పారు. ఆత్మీయ బలూచ్‌ నాయకుడు చెడుపై మంచి విజయానికి ప్రతీకగా రాబోతున్న దసరా పండుగ సందర్భంగా బలూచిస్తాన్‌, భారత్‌ (హిందుస్థాన్‌) హిందూ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.

హింగ్లాజ్‌ ఆలయాన్ని పునరుద్ధరించడం, భారతీయ యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి సులభమైన మార్గాలను సుగమం చేయాలనే లక్ష్యంతో దౌత్య ఛానెల్‌లను సంప్రదించే నిమిత్తం వ్యక్తిగత ఆసక్తి తీసుకోవాలని పిపిఎఫ్‌ఎ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. బలూచ్‌ జాతీయులు లౌకిక స్వభావం కలిగి ఉన్నందున, తమ కలను నెరవేర్చడంలో వారిని కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని ఫోరమ్‌ భావిస్తున్నది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి