News

విదేశాలకు భారత్ టీకా సాయం

651views

న్యూఢిల్లీ: కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్​ టీకాలు అందించి అండగా నిలిచిన భారత్​.. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుటపడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు అందించి, సాయపడాలని భావిస్తోంది.

భారత్​లో అదనంగా ఉన్న కొవిడ్​ టీకాలను ‘వ్యాక్సిన్​ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయా తెలిపారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. అయితే.. దేశ పౌరులకు వ్యాక్సిన్ వేయడమే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి