214
-
బుద్గాంలో శక్తివంతమైన పేలుడు పదార్థాలు స్వాధీనం
శ్రీనగర్: సెంట్రల్ కశ్మీర్‌లో పెను ముప్పు తప్పింది. బుద్గామ్ జిల్లాలోని హమ్‌హమా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉంచిన ఒక శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భద్రతా దళాలు మంగళవారం గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఉదయం సాధారణ పెట్రోలింగ్ సమయంలో భద్రతా దళాలు విమానాశ్రయం సమీపంలోని గోగు-గాలి ప్రాంతంలో రోడ్డుపై ఉక్కు కంటైనర్ పడి ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.
దీని తరువాత ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని, బాంబు నిర్మూలన బృందానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కంటైనర్‌లో ఉంచిన ఆరు కిలోల బరువున్న పేలుడు పదార్థాన్ని బయటకు తీసి ఎటువంటి నష్టం జరగకుండా నిర్వీర్యం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Source: Uttamahindu