
-
విలేఖర్ల సమావేశంలో చిన్నజీయర్ స్వామి వెల్లడి
భాగ్యనగరం: ఇక్కడి శంషాబాద్‌లోని ముచ్చింతల్ శ్రీరామనగర్‌లో 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకల ఆహ్వాన పత్రాలను ప్రముఖులకు అందించారు. అతిపెద్ద సమాతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన మహత్కార్కానికి పూనుకున్న నేపథ్యంలో శ్రీశ్రీశ్రీ త్రిదిండి చిన్నజీయర్ స్వామి సోమవారం విలేఖర్లతో మాట్లాడారు.
ఈ బృహత్కార్యానికి సంబంధించిన కార్యక్రమ వివరాల్ని చిన్న జీయర్ వెల్లడించారు. 2022 ఫిబ్రవరి రెండోతేదీ నుంచి 14వ తేదీ వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా జరగబోతున్నాయి. 200 ఎకరాల్లో వేయి కోట్లతో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠంచనున్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీజేఐ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానించారు. మహోజ్వల ఘట్టానికి తప్పకుండా హాజరవుతామని చినజీయర్‌స్వామికి కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ ఇప్పటికే హామీ ఇచ్చారు.
Source: Tv9





