News

పూరీ ఆలయంలో తవ్వకాలు

523views

పూరీ: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో గుప్తనిధుల కోసం మళ్లీ తవ్వకాలు అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఆలయం ప్రాంగణంలో ఉన్న ఎమర్‌ మఠంలో తవ్వకాలు జరుపుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు, నిపుణులు 12వ శతాబ్దానికి చెందిన మఠంలో మెటల్‌ డిటెక్టర్ల సాయంతో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఎమర్‌మఠాధిపతి నారాయణ్‌ రామానుజదాస్‌ సమాచారంతో తవ్వకాలు జరుగుతున్నాయి.

గతంలో కూడా నిధుల కోసం ఈ మఠంలో తవ్వకాలు జరిపారు. 2011లో జరిపిన తవ్వకాల్లో 18 టన్నుల వెండి వస్తువులు లభించాయి. అప్పట్లోనే దీని విలువ 90 కోట్లుగా గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన తవ్వకాల్లో కూడా భారీగా వెండి బయటపడింది. పురాతన ఖడ్గాలు, వెండి పువ్వులు, కాంస్యపు ఆవు ఈ మఠంలో లభించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి