News

అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం!

594views
  • లక్షల్లో కరోనా కేసుల న‌మోదు, వేలల్లో మరణాలు

కాలిఫోర్నియా: అమెరికాలో మళ్లీ కరోనా స్వైర విహారం చేస్తోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నా రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. రోజూ 2 వేల మందికి పైగా మృతి చెందుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫ్లోరిడా, టెక్సస్‌, కాలిఫోర్నియాలో అత్యధికంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నమోదవుతున్న కేసుల్లో 99 శాతం డెల్టా వేరియంట్‌వేనంటున్నారు అమెరికా వైద్యులు. అమెరికాలో 54 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోగా.. 63 శాతం మంది ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి