News

ఆఫ్ఘన్‌లో ఆకలి కేకలు!

105views

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి కేకలు చోటుచేసుకున్నాయి. పనులు లేక ఆదాయాలు రాక చాలా దారుణమైన స్థితికి దిగజారిపోయారు మిడిల్‌ క్లాస్‌ కుటుంబాలు, పేద ప్రజలు. ఉపాధి లేక, చేతిలో డబ్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కన్నబిడ్డలకు భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు.

దీంతో ఇంట్లో ఉన్న వస్తువులను అమ్ముకుంటూ ఉన్నారు. సోఫా, టీవీ, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషీన్‌, బీరువా ఇలా అమ్మకానికి అనువైన వస్తువులను వీధుల్లోకి తీసుకొచ్చి అతి తక్కువ ధరకే అమ్మేస్తూ ఉన్నారు. వచ్చిన డబ్బులతో పిల్లలకు ఆహార పదార్థాలు కొనుక్కుంటున్నారు.

ఇలా విక్రయించేవారితో కాబూల్‌ వీధులు రద్దీగా మారాయి. ఇప్పుడైతే ఉన్నవి అమ్ముకోడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో పరిస్థితి ఏమిటి అన్నది వాళ్లకు కూడా అర్థం అవ్వడం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరీ దారుణంగా మారుతాయని భయపడుతూ ఉన్నారు ఆఫ్ఘన్‌ ప్రజలు.

Source: Nationalist Hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి