News

ఆఫ్ఘ‌న్‌లో వరుస పేలుళ్ళు

536views
  • ముగ్గురు మృతి

  • 20 మందికి తీవ్ర గాయాలు

న్యూఢిల్లీ: తాలిబన్ల స్వాధీనంలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్‌లో శనివారం వరుస పేలుళ్ళు సంభవించాయి. ఆ నగరమంతా దద్దరిల్లింది. నంగార్హర్‌ ప్రాంతంలోని జలాలాబాద్‌లో తాలిబన్‌ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం. అయితే, తాలిబన్ల ప్రభుత్వానికి ఐసిస్‌ నుంచి ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా వారే ఈ దాడులకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దేశ రాజధాని కాబుల్‌లోనూ శనివారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి