News

ఏవోబీలో ఎదురుకాల్పులు!

492views

విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో భ‌ద్ర‌తా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పుల జ‌రిగాయి. మావోయిస్టులు త‌ప్పించుకున్నారు. అగ్ర నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి కూడా తప్పించుకున్నట్టు ఒడిశా పోలీసులు వెల్ల‌డించారు. కాగా, సంఘ‌ట‌న స్థ‌లంలో మావోయిస్టు సామగ్రి స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు.

Photo: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి