
-
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులకు ప్రత్యేక ఆహ్వానం
న్యూఢిల్లీ: సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్ స్వామి. ఢిల్లీలో రాష్ట్రపతికి స్వయంగా చినజీయర్ స్వామి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. శంషాబాద్ ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహం ఏర్పాటు కాబోతోంది.

200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. ఇదే వేదికపై శ్రీనివాస రామానుజం, మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు రాష్ట్రపతిని కలిశారు. విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నారు.

యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా కలిసి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరారు. అదేవిధంగా, సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను చిన్నజీయర్ స్వామి, మై హోమ్స్ ఛైర్మన్ డాక్టర్ రామేశ్వరరావు ఆహ్వానించారు.
Source: Tv9





