
710views
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలంలోని బెలుగుప్ప తండాలో అత్యంత వైభవంగా మారెమ్మ జాతర జరిగింది. ఈ జాతరకు సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రంలోని గిరిజనులు, బెలుగుప్ప మండలంలోని తండావాసులు మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ కలశాలతో ఊరేగింపుతో ప్రారంభమైన ఈ జాతర కన్నుల పండుగగా జరిగింది.

ఈ మారెమ్మ జాతరలో ఆలయ పూజారి పెద్ద గుట్టగా వేసిన ముల్లకంపలను ఎక్కుతూ వెళ్లి అటువైపు ఉన్న అమ్మవారిని దర్శించుకొని ఆ పదునైన ముల్లపై పడుకొంటారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘట్టం జాతరకే ప్రధాన ఆకర్షణ అని అక్కడి భక్తులు చెబుతున్నారు. ఆ జాతరలో ఈ కార్యక్రమం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది.
Source: EtvBharat





