
-
ప్రారంభించిన ప్రధాని
-
పార్లమెంట్ కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసద్ టీవీ ప్రసారాలను బుధవారం ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ రెండు టీవీలను కలిపి సంసద్ టీవీగా ప్రారంభించారు.
ప్రధాని మోదీ మాట్లాడారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున సంసద్ టీవీ ప్రారంభమవుతుండటం సంతోషకరమంటూ వెల్లడించారు. పార్లమెంట్ వ్యవహారాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు సంసద్ టీవీ దోహదం చేస్తుందని ప్రకటించారు. సంసద్ టీవీలో కార్యక్రమాలు నాలుగు రకాలుగా ప్రసారం కానున్నాయి. పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు, పథకాలు, విధానాల అమలు, పాలన, భారత దేశ చరిత్ర, సంస్కృతి, సమకాలిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమవుతాయి.





