News

పంజాబ్‌లో అర్ధరాత్రి పేలిన బైక్‌ బాంబ్‌!

657views
  • ఉలిక్కిపడ్డ స్థానికులు

  • నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే టార్గెట్‌

  • భారీ విధ్వంసానికి ముష్కరమూకల ప్లాన్‌

  • దేశవ్యాప్తంగా హై అలర్ట్‌: కేంద్ర హోం శాఖ వెల్లడి

పంజాబ్‌: పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు ఎప్పటికప్పుడు మట్టుపెడుతుండడంతో కొంతకాలంగా భారతదేశంలో బాంబు పేలుళ్ళ అలజడి లేదు. తాజాగా పంజాబ్‌లోని జలాలాబాద్‌లో అర్ధరాత్రి బాంబు పేలుడు సంభవించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బైక్‌లో అమర్చిన బాంబు పేలుడు వల్ల ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మరో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.

ఇది ఉగ్రవాదుల పనేనని పోలీసులు గుర్తించారు. కాగా, దేశంలో జరగనున్న నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలను లక్ష్యంగా చేసుకున్నట్టు నిఘా విభాగం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది.

Source: Tv9, Photo: ANI

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి