
న్యూఢిల్లీ: విపత్తు నష్ట భయం తగ్గింపు, నిర్వహణ రంగంలో సహకారం కోసం భారత గణతంత్రానికి చెందిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్ డిఎంఎ)కు, ఇటలీ గణతంత్రానికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ ప్రొటెక్శన్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్‌ఒయు) కుదిరింది. ఈ మేరకు ఈ సంగతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం దృష్టికి వెళ్ళింది.
ప్రయోజనాలు
విపత్తు నష్ట భయం తగ్గింపు, నిర్వహణ రంగంలో సహకారం కోసం ఎమ్‌ఒయు పై భారత గణతంత్రానికి చెందిన ఎన్ డిఎమ్‌ఎ, ఇటలీ గణతంత్రానికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ ప్రొటెక్శన్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంతకాలు చేశాయి.
ఈ ఎమ్‌ఒయు ప్రకారం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుంది. ఆ వ్యవస్థ వల్ల ఇటు భారతదేశం, అటు ఇటలీ.. ఈ రెండు దేశాలు పరస్పరం విపత్తు నిర్వహణ యంత్రాంగాల తాలూకు ప్రయోజనాలను పొందగలుగుతాయి. అంతేకాదు, విపత్తు నిర్వహణ రంగంలో సన్నాహక చర్యలు, ప్రతిస్పందన, సామర్థ్యాల పెంపుదల రంగాలను పటిష్ఠపరచడంలో సాయం అందుతుంది.
విపత్తు నష్ట భయం తగ్గింపు, నిర్వహణ రంగంలో సహకారానికి సంబంధించిన ఎమ్‌ఒయుపై భారత గణతంత్రానికి చెందిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్ డిఎమ్‌ఎ)కు, ఇటలీ గణతంత్రానికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ ప్రొటెక్శన్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కు మధ్య2021 జూన్‌లో సంతకాలు అయ్యాయి.
Source: Pib





