
750views
-
బస్సు, కారు ఢీ, ఐదుగురు సజీవ దహనం
ఝార్ఘండ్‌లో: ఝార్ఘండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న బస్సు, కారు ఢీకొన్నాయి. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు కారులోనే సజీవ దహనమయ్యారు. మంటలు బస్సుకూ అంటుకున్నాయి. రాజ్‌రప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్బంద వద్ద 23వ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ టీనేజీ అబ్బాయి ఉన్నారని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. బాధితులు పట్నాకు చెందినవారని గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Source: EtvBharat





