
589views
-
విదేశాంగ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల వైఖరి వల్ల తీవ్ర మానవతా సంక్షోభం చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి వర్చువల్ విధానంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి జైశంకర్ ప్రసంగించారు. ‘భారతదేశానికి అఫ్గాన్ ప్రజలతో చారిత్రక స్నేహం ఉంది. భవిష్యత్తులోనూ అది అలాగే కొనసాగుతుంది. ఇదే భారత్ విధానం’ అని జైశంకర్ ఉద్ఘాటించారు. అఫ్గాన్ సంక్షోభం ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావాన్ని చూపుతుందన్నారు.





