News

24న క్వాడ్‌ సమావేశంలో పాల్గొనున్న మోదీ

576views
  • చర్చకు రానున్న అంతర్జాతీయ విషయాలు

న్యూఢిల్లీ: అమెరికాలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్‌(Quad-Quadrilateral Security Dialogue) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిదె సుగా పాల్గొననున్నారు. ఈ క్వాడ్‌ సమావేశంలో నాలుగు దేశాల నేతలు కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో సహకారం, వాతావరణ సంక్షోభానికి పరిష్కారం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ తదితర అంశాలపై చర్చించనున్నట్టు శ్వేతసౌధం అధికార ప్రతినిధి జెన్‌ సాకి వెల్లడిరచారు.

ఈఏడాది మార్చిలో మొట్టమొదటిసారిగా జరిగిన క్వాడ్‌ సమావేశాన్ని కరోనా కారణంగా వర్చువల్‌గా నిర్వహించారు. ఆ భేటీలో పాల్గొన్న అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాధినేతలు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏకపక్ష ఆధిపత్యవైఖరి నేపథ్యంలో స్వేచ్ఛాయుత జలరవాణాపై క్వాడ్‌ నేతలు చర్చించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి