News

ఎల్‌ఓసీ దరి కోవెలకు గణేష్‌ విగ్రహం తరలింపు

750views
  • సైనికుల భద్రతే తనకు ముఖ్యం… మహిళా భక్తురాలు కిరణ్బాలా ఇషర్‌

ముంబై: వినాయక చవితి సమీపిస్తుండడంతో భారతదేశ వ్యాప్తంగా పూజా సన్నాహాలు ఊపందుకున్నాయి. ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జమ్మూకశ్మీర్‌లోనూ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గణపతి పూజ నిమిత్తం తాజాగా పూంచ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి) సమీపంలో ఉన్న దేవాలయంలో పెట్టేందుకు ‘ఇండియా-పాకిస్తాన్‌ బోర్డర్‌ చ రాజా’ అని పిలువబడే వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తున్నాయి.
వినాయక చవితి ఉత్సవానికి సంబంధించిన విగ్రహాన్ని ముంబై నుండి పూంచ్‌కు రవాణా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆరేళ్ళుగా ప్రోగ్రెసివ్‌ నేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న కిరణ్బాలా ఇషర్‌(ఈమెను ‘ఈశ్వర్‌ దీదీ’ అని కూడా పిలుస్తారు) సైనికులు, వారి కుటుంబాల భద్రత కోసం పూచ్‌లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు, నా కుటుంబానికి గణపతి బప్పపై ప్రత్యేక నమ్మకం ఉంది… నేను సైన్యం నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాను… ఇటువంటి గణపతి బప్ప విగ్రహాలను ఆరేళ్ళుగా ముంబై నుండి తీసుకువెళ్తున్నాను. ఇది నాకు ముఖ్యమైన పండుగలలో ఒకటి… సైనికులు, వారి కుటుంబాల భద్రత కోసం బప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది’ అని ఇషర్‌ చెప్పారు.
‘మన దేశ సైనికులకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను, అడ్డంకులను వినాయకుడు సంపూర్ణంగా తొలగించాలని నా కోరిక. గణపతి బప్ప కూడా భారతదేశం, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతను తగ్గించాలని నా కోరిక. ఇరు దేశాలు సుభిక్షంగా, సురక్షితంగా జీవించగలవు’ అని ఆమె అన్నది.
కళాకారుడు విక్రాంత్‌ పాండ్రే ఆరేళ్ళుగా ముంబైలోని కుర్లాలోని తన వర్క్‌షాప్‌లో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ ఏడాది గణేష్‌ విగ్రహానికి పాండ్రే ప్రత్యేక అలంకరణలు చేశారు. గణపతి బప్ప వెనుక, పాండ్రే ఇనుప తీగలతో ఫెన్సింగ్‌ను పెట్టారు. విగ్రహం వెనుక కాశ్మీర్‌లోయ అందాలను చూపించే పెద్ద బ్యానర్‌ కూడా ఉంది. సరిహద్దు నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ వర్ణన కూడా ఉంది.
అలంకరణ గురించి ఇషర్‌ మాట్లాడుతూ, ‘బప్పా ఇండియా పాకిస్తాన్‌ సరిహద్దుకు వెళుతున్నందున, ఈ దృశ్యం ద్వారా ముంబైలో నివసిస్తున్న ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము… ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కేవలం 600 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తాలిబాన్‌ స్వాధీనం చేసుకుంది. ఆ దేశం, అక్కడ నివసించే ప్రజల భయం గురించి మేము ప్రజలకు చెప్పాలనుకుంటున్నాము’ అని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి