
718views
-
ఖండించిన హిందూ సంఘాలు
-
క్షమాపణలు చెప్పేదాకా సినిమాలు ఆడనివ్వమని హెచ్చరిక
ముంబాయి: హిందుత్వ సంస్థలను తాలిబన్‌తో పోలుస్తూ బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. తాలిబన్లు ఇస్లాం దేశాన్ని కోరుకుంటున్నారు. వీరు హిందూ దేశాన్ని కోరుకుంటున్నారు. అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
హిందూ దేశ అనుకూలవాదులను తాలిబన్ల మనస్తత్వం ఉన్నవారిగా పేర్కొనడం ఏంటని శివసేన ప్రశ్నించింది. సమాజాన్ని గందరగోళపరిచే కుట్రలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్వహిందూ పరిషత్ వ్యాఖ్యానించింది. మరోవైపు జావేద్ క్షమాపణలు చెప్పేవరకూ తన సినిమాలను దేశంలో ఆడనివ్వమని భాజపా ఎమ్మెల్యే రామ్ కదమ్ హెచ్చరించారు.





