News

 దోహా వేదికగా తాలిబాన్లతో భారత్ చర్చలు.. భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆపడమే ఎజెండా..

367views

ఫ్గానిస్థాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించకుండా చూడటంపైనే ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపింది విదేశాంగ శాఖ. తాలిబన్ల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం, దాని స్వభావంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్ నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టెనెక్జాయ్తో.. భారత రాయబారి దీపక్ మిత్తల్ భేటీ అయిన రెండు రోజుల తర్వాత ఈ మేరకు స్పందించింది.

తాలిబన్లతో భారత ప్రతినిధి సమావేశం నేపథ్యంలో వారి ప్రభుత్వాన్ని గుర్తిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు బాగ్చీ. ‘ఇది కేవలం సమావేశమే. ఇప్పుడే చెప్పటం తొందరపాటు అవుతుంది,’ అని తెలిపారు. మరిన్ని సమావేశాల నిర్వహణపైనా స్పందించారు బాగ్చీ. తనకు ఎలాంటి సమాచారం లేదని, అలాంటి వార్తలను వ్యాప్తి చేయాలనుకోవట్లేదన్నారు. ప్రస్తుతం కాబుల్ విమానాశ్రయం మూసివేసి ఉందని, తెరుచుకోగానే.. భారతీయుల తరలింపును పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి