News

తాలిబాన్‌లకు మద్దతు ఇవ్వద్దు అన్నందుకు నటుడు నసీరుద్దీన్ షాపై ముస్లింల దాడి!

1.8kviews

భార‌తీయులు శాంతియుతంగా, అహింసాత్మకంగా ఉండాలని, తాలిబాన్‌లకు మద్దతు ఇవ్వకూడదని ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా స‌ల‌హా ఇచ్చారు. ఈ స‌ల‌హా జీర్ణించుకోలేక భారతీయ ముస్లింలు నసీరుద్దీన్ షాపై దాడి చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ విజయాన్ని జరుపుకొన్నందుకు కొంతమంది భారతీయ ముస్లింలు సోషల్ మీడియా వేదికలపైకి వ‌చ్చి, మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో బుధవారం, నసీరుద్దీన్ షా… భారతీయ ముస్లింలలో ఆ వ‌ర్గం వైఖ‌రిని ఖండిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన సందర్భంగా భారతీయ ముస్లింలలో ఒక వర్గం సంబ‌రాలు చేసుకుంది. ఇటువంటి వ‌ర్గాల‌తో ప్రమాదకరమని ప్రముఖ నటుడు పేర్కొన్నాడు.

తాలిబ‌న్ల వ‌ల్ల చ‌ర్య‌ల‌తో ప్రపంచం ఆందోళన చెందుతోంది. అయితే, భారతీయ ముస్లింలలో ఒక వ‌ర్గం అనాగరికుల్లా వేడుక‌లు చేసుకోవ‌డం ఆందోళ‌న‌క‌ర ప‌రిణామ‌మ‌ని షా ఆ వీడియోలో పేర్కొన్నారు. షా వీడియోపై ఇస్లాం వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని సొంత‌ వ్యాపారాన్ని పట్టించుకోవాలని స‌ల‌హా ఇచ్చారు. ఎక్కువ‌శాతం ముస్లింలు, ఆ వ‌ర్గంలోని విద్యాధికులు సహా, షా వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు… ఇస్లాం గురించి వ్యాఖ్యానించకుండా దూరంగా ఉండాలని కోరారు. నసీరుద్దీన్ షాను చ‌దువుకోని ముస్లిం అని పిలిచిన AAP అనుకూల బ్లాగ్ జన కా రిపోర్టర్ రిఫత్ జవైద్, ఇస్లాంలో మతపరమైన సంస్కరణలు ఉండాల‌న్నందుకు షాపై దాడి చేశాడు. “ఈ భయంకరమైన సలహా ఇచ్చే ముందు అతను మొదట ఇస్లాం మతం ఆచరించాలని నేను కోరుకుంటున్నాను” అని రిఫత్ జవైద్ తన ట్విట్టర్ పోస్ట్‌లో అన్నారు.

SOURCE: OPINDIA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.