
846views
అఫ్గాన్ నుంచి దళాల ఉపసంహరణ విషయంలో అమెరికాలోని బైడెన్ సర్కారు చేస్తోన్న తప్పులకు అంతూపొంతు లేకుండా పోతోంది. తాజాగా మరో మహా తప్పిదం చేసినట్లు న్యూయార్క్ పోస్టు పత్రిక వెలుగులోకి తెచ్చింది. అఫ్గానిస్థాన్‌లో అమెరికాకు సాయం చేసిన వ్యక్తుల జాబితాను తాలిబన్ల చేతికిచ్చినట్లు పేర్కొంది. ఇప్పుడు తాలిబన్లు ఆ జాబితా ఆధారంగా హిట్‌లిస్టు రూపొందించుకుని వారి కోసం వెతుకుతున్నారు. శ్వేత సౌధం బ్రీఫింగ్ తర్వాత దీనిపై ప్రశ్నిస్తే.. ‘జరిగి ఉండొచ్చు’ అనే సమాధానం వచ్చింది.
ఇంటింటికీ వెళ్లి వెతుకుతున్న తాలిబన్లు
తాలిబన్లు అమెరికాకు సాయం చేసిన వారిని పట్టుకొనేందుకు ఇంటింటికీ వెళ్లి సోదాలు చేస్తున్నారు. దీంతో అమెరికాకు వివిధ దశల్లో సాయం చేసిన వేలమంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి.





