News

బెంగాల్ ఎన్నికల అనంతర హింస: సిబిఐ దర్యాప్తు ప్రారంభం : తొమ్మిది కేసులు నమోదు

504views

శ్చిమ బెంగాల్ హింసాకాండపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశించిన తరువాత, ఏజెన్సీ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ విషయంలో తొమ్మిది కేసులను నమోదు చేసింది. దర్యాప్తు కోసం సీబీఐ బృందం బెంగాల్‌లోని హింస జరిగిన ప్రదేశాలకు కూడా వెళ్ళింది.

ఈ నెల ప్రారంభంలో… కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు ఆదేశించింది.

తక్కువ తీవ్రమైన నేరాల దర్యాప్తుకు SIT బృందాలను ఏర్పాటు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ కేడర్ లోని సీనియర్ అధికారులు కూడా బృందంలో ఉంటారు.

ఎన్నికల అనంతర హింస బాధితులకు పరిహారం అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మే 2 న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత అనేక చోట్ల అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ ద్వారా నియమించబడిన నలుగురు సభ్యుల బృందం కూడా హింస జరిగిన ప్రాంతాలను సందర్శించింది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.