News

రూ.1.26 లక్షల కోట్ల అభివృద్ధి పనులపై మోడీ సమీక్ష… 14 రాష్ట్రాలు హాజరు

700views

‘వన్ నేషన్ వన్ రేషన్’ పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సమీక్ష నిర్వహించారు. 37వ ప్రగతి సమావేశంలో భాగంగా… 14 రాష్ట్రాల్లో సుమారు రూ.1.26 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ఎనిమిది ప్రాజెక్ట్ లను సమీక్షించారు. ప్రాజెక్టులు తెలుకున్నారు.

ఓఎన్ ఓఆర్ పై సమీక్షించిన మోడీ… ఈ పథకం విస్తృత ప్రయోజనాలను ప్రజలకు అందించేలా చూడాలని అధికారులను కోరారు. ఇందుకుగానూ ఈ కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన సాంకేతిక ఫ్లాట్ ఫాంలను ఉపయోగించుకోవాలని సూచించారు. సకాలంలో ప్రాజెక్ట్ లను పూర్తిచేయాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. ప్రధానమంత్రి సమీక్షించిన ఎనిమిది ప్రాజెక్ట్ లలో మూడు రైల్వే, మూడు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలకు సంబంధించినవి కాగా మరో రెండు విద్యుత్ శాఖకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, హరియాణా, ఛత్తీస్ గఢ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, మణిపూర్, ఢిల్లీల్లో ఉన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణంపైనా సమావేశంలో దృష్టిసారించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకలు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.