
జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులను కాల్చి చంపారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సోపోర్‌లోని పెథ్‌సీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిర్దిష్ట సమాచారంతో భద్రతా దళాలు జాయింట్ కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
“పోలీసులు మొదట ఆ ఉగ్రవాదులను లొంగిపో వాల్సిందిగా కోరారు. కానీ ఉగ్రవాదులు జాయింట్ సెర్చ్ పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి వారి మృతదేహాలను వెలికితీసినట్లు కూడా పోలీసులు తెలిపారు.
కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు కప్రెన్ షోపియాన్ నివాసి ఫయాజ్ అహ్ థోకర్ కుమారుడు ఫైసల్ ఫయాజ్, టేకిపురా కుప్వారా నివాసి అబ్దుల్ అహద్ షేక్ కుమారుడు ముస్తఫా షేక్ మరియు జిపోర్ ధరమతి నివాసి అబ్ మజీద్ ఘనీ కుమారుడు రమీజ్ అహ్ ఘనీలు. షోపియాన్ కి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్‌ఈటీ (టీఆర్‌ఎఫ్) తో అనుబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో భద్రతా సంస్థలపై దాడులు, సాధారణ పౌరులపై దాడులతో సహా అనేక తీవ్రవాద కార్యకలాపాలతో మృతులకు సంబంధముంది.
“ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుండి ఒక AK-47 రైఫిల్ మరియు రెండు పిస్టళ్ళతో సహా ప్రమాదకరమైన పదార్థాలు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
“కశ్మీర్ డివిజన్‌లో ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించటానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, CRPF మరియు కాశ్మీర్ లోయ ప్రజల సమష్టి కృషి కారణమైంది” అని కాశ్మీర్ IGP పేర్కొన్నారు.
ఈ మైలురాయిని సాధించినందుకు మైదానంలో గొప్ప సామర్ధ్యము, సమన్వయంతో పనిచేస్తున్న జాయింట్ టీమ్ లను ఆయన అభినందించారు. ఇది ఒక పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.
Source : Organiser





