News

తాలిబన్లతో రహస్య చర్చలు జరుపుతున్న అమెరికా నిఘా విభాగం సిఐఎ

710views

మెరికా అత్యున్నత నిఘా విభాగమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, తాలిబన్ల మధ్య రహస్య సమావేశం జరిగింది. తాలిబన్ నాయకుడు అబ్దుల్ ఘనీ బరాదర్​తో సీఐఏ డైరెక్టర్ విలియమ్ జే బర్న్స్​ భేటీ అయ్యారు.

కాబుల్ వేదికగా సోమవారం ఈ సమావేశం జరిగినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. ఈ విషయాలను అమెరికా అధికారులే వెల్లడించారని తెలిపింది. అఫ్గాన్​ను ఆక్రమించుకున్న తర్వాత అమెరికా, తాలిబన్ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని, ఈ నేపథ్యంలో సమావేశం జరిగిందని వార్తా సంస్థ పేర్కొంది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు ఆగస్టు 31 వరకు గడువు ఉండగా.. దీన్ని పెంచే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించేందుకు సీఐఏ నిరాకరించింది. డెడ్​లైన్​పైనే చర్చ జరిగి ఉండొచ్చని ఓ అధికారి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.