News

రూ.83 కోట్లతో సోమనాథ్ దేవాలయ అభివృద్ధి పనులు.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

711views

గుజరాత్​లోని చారిత్రక సోమనాథ్ ఆలయంలో రూ.83 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్​ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పార్వతీ దేవీ ఆలయానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ సహా పలువురు నేతలు పాల్గొనున్నారు. సోమనాథ్​ ఆలయం వెనుక సముద్ర తీరంలో రూ.49 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కిలోమీటర్​ పొడవైన ‘సముద్ర దర్శనం’ నడక మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. కొత్తగా నిర్మించిన ఓ మ్యూజియాన్నీ ప్రారంభిస్తారని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.