News

అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వద్ద బాంబు కలకలం – అప్రమత్తమైన భద్రతా దళాలు

434views

మెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌  భవనం వద్ద బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. యూఎస్‌ కాపిటల్‌ భవనం, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌ వద్ద అనుమానాస్పదంగా ఆగివున్న ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా కాపిటల్ పోలీసులు అక్కడ పరిసర ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయించారు. ప్రజలను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న దానిపై దృష్టి సారించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయమై యూఎస్‌ కాపిటల్‌ పోలీసులు మాట్లాడుతూ.. లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్ ‌కు సమీపంలో అనుమానస్పద వాహనం నిలిపి ఉందన్న వార్తతో వెంటనే స్పందించాం. దీనికి సమీపంలోనే కాపిటల్‌ భవనంతో పాటు సుప్రీం కోర్టు ఉంది. కేనాన్‌ హౌజ్‌ ఆఫీసును కూడా ఖాళీ చేయించామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.