454
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ఉగ్రవాద పోషక విధానాలను భారత్ దుయ్యబట్టింది. పాకిస్థాన్ ఆధారంగా పనిచేసే లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు.. ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఐరాస భద్రతా మండలిలో పేర్కొంది. వీరికి కొందరి నుంచి శిక్షణ, ప్రోత్సాహం అందుతున్నాయని పరోక్షంగా పాక్నుద్దేశించి వ్యాఖ్యానించింది. ఉగ్రవాదంపై ఒక్కో విధంగా స్పందించే తీరు ఉండకూడదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించాలని పిలుపునిచ్చింది.
ఐరాస భద్రతా మండలి ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన విదేశాంగ మంత్రి జైశంకర్.. ఉగ్రవాదుల చర్యల వల్ల అంతర్జాతీయ శాంతికి కలుగుతున్న ముప్పు గురించి సభ్య దేశాలకు వివరించారు. హక్కానీ నెట్ వర్క్ విస్తరించడం ఆందోళనకరమని అన్నారు.