సంజయ్ గా మారిన రేకిబుద్దీన్ – హిందూ అమ్మాయికి వల – వ్యక్తిగత చిత్రాలు వైరల్ – అవమానంతో యువతి ఆత్మహత్య

లవ్ జిహాద్ కారణంగా మోసపోయిన హిందూ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. రేకిబుద్దీన్ అనే ముస్లిం సంజయ్ గా పేరు మార్చుకున్నాడు. ఒక హిందూ అమ్మాయిని ప్రేమ వలలో బంధించాడు. అనంతరం తాను బాలికతో సన్నిహితంగా ఉన్న చిత్రాలను రేకిబుద్దీన్ అహ్మద్ ఫేస్‌బుక్‌లో వైరల్ చేశాడు. అవమానానికి గురైన ఆ పేద అమ్మాయి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తనను తాను చంపుకోవలసి వచ్చింది.
నిందితుడు రేకిబుద్దీన్ అహ్మద్ అసోంలోని నల్బరీ జిల్లాకు చెందినవాడు. వృత్తి రీత్యా జూనియర్ ఇంజనీర్. రేకిబుద్దీన్ ఒక ప్రైవేట్ నిర్మాణ సంస్థలో పనిచేసేవాడు. అతను తన కంపెనీ చీపట్టిన వంతెన నిర్మాణ పనిలో భాగంగా తేజ్‌పూర్ పట్టణంలోని బంధ్‌మారి ప్రాంతంలో నియమించబడ్డాడు. అతను తనను తాను కమ్రూప్ జిల్లాలోని రంగియా ప్రాంతానికి చెందిన సంజయ్ తాలూక్దార్ గా అక్కడ పరిచయం చేసుకున్నాడు.
రేకిబుద్దీన్ అలియాస్ సంజయ్ అదే ప్రాంతానికి చెందిన స్థానిక యువతి హియా దైమారికి పరిచయమయ్యాడు. సంజయ్ మరియు హియా స్నేహితులయ్యారు. హియా హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థిని. రేకిబుద్దీన్ అలియాస్ సంజయ్, హియాలు ప్రేమలో పడ్డారు. అయితే కొంతకాలం తర్వాత, సంజయ్ వాస్తవానికి నల్బరి జిల్లాకు చెందిన రేకిబుద్దీన్ అహ్మద్ అని హియాకు తెలిసింది. దాంతో ఆ అమ్మాయి షాకయింది..
ఆమె రేకిబుద్దీన్ అహ్మద్ తో సంబంధాన్ని తెంచుకుంది. దాంతో రేకిబుద్దీన్ హియా దైమారిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. హియా సన్నిహితులు, కుటుంబ సభ్యులు హియా యొక్క నకిలీ ప్రేమికుడు రేకిబుద్దీన్ హియాను మానసికంగా హింసించి, చాలాకాలం పాటు వేధించాడని ఆరోపించారు. నిందితుడు ఇస్లాం మతం స్వీకరించి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా తనను ఒత్తిడి చేశాడని, కానీ ఆమె అందుకు నిరాకరించిందని హియా సన్నిహితుడొకరు వెల్లడించారు.
చివరికి రేకిబుద్దీన్ ఆ అమ్మాయితో తాను సన్నిహితంగా ఉన్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో వైరల్ చేశాడు. దాంతో దిక్కుతోచక ఆ పద్దెనిమిదేళ్ల బాలిక ఆగష్టు 5 న ఆత్మహత్య చేసుకుంది. ఆ పేద బాలిక సిగ్గు, అవమానంతో తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె మరణానికి రేకిబుద్దీనే కారణమని, ఆమె వ్యక్తిగత చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబం తేజ్‌పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సంఘటన జరిగిన వెంటనే, రేకిబుద్దీన్ తేజ్పూర్ నుండి పారిపోయాడు. అతను పది రోజుల పాటు అస్సాంలోని దిగువ ప్రాంతాలలో దాక్కుని ఉన్నాడు. చివరగా, ఆగస్టు 16 న, నిందితుడి కోసం వెతికిన తేజ్‌పూర్ పోలీసులు, నల్బరిలో రేకిబుద్దీన్ ను అరెస్టు చేశారు. బాలిక వ్యక్తిగత చిత్రాలు రేకిబుద్దీన్ ద్వారానే వైరల్ చేయబడ్డాయనే స్పష్టమైన ఆధారాలు దొరికాయని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. తదుపరి విచారణ కోసం తేజ్‌పూర్ పోలీసులు రేకిబుద్దీన్ ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలను పునరావృతం చేయడానికి ఎవరూ సాహసించకూడదని, నేరస్థుడికి కఠిన శిక్షను విధించాలని మరణించిన బాలిక కుటుంబం కోరుతోంది.
Source : Organiser





