News

జమ్ము కాశ్మీర్ : భాజపా నేత ఇంటిపై గ్రనేడ్ దాడి?

775views

జమ్ముకశ్మీర్​లో రాజౌరి జిల్లాలో భాజపా నేత జస్బీర్​ సింగ్​ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జస్బీర్​ కుటుంబ సభ్యులంతా కూర్చొని ఉండగా.. ఈ పేలుడు సంభవించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న భద్రత సిబ్బంది.. గ్రనేడ్ పేలినట్లు అనుమానిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.