News

UP : మెహందీ పేరుతో హిందూ మహిళల్ని లవ్ జిహాద్ ఉచ్చులోకి దించుతున్న ముస్లింలు… అవగాహన కల్పిస్తున్న హిందూ సంస్థలు…

661views

‘హర్తాలికా తీజ్’ అనే పండుగ సందర్భంగా హిందూ మహిళలకు ముస్లిములు మెహెందీ పెట్టరాదంటూ యూపీలో క్రాంతిసేన అనే సంస్థ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ముజఫర్ నగర్ లో ఈ సంస్థ సభ్యులు స్థానిక మార్కెట్లంతా కళ్యా తిరిగి చెకింగ్ డ్రైవ్ నిర్వహించారు. హిందూ మహిళలకు హెన్నాను పెట్టే ఈ వర్గం వారిని పనిలో పెట్టుకోరాదని దుకాణదారులను సంస్థ కార్యదర్శి మనోజ్ సైని కోరారు. ఇది కేవలం ముజఫర్ నగర్ కే పరిమితం కాదని.. ప్రతి వీధికి, దుకాణానికి వెళ్లి ఈ విధంగా కోరుతున్నామని అన్నారు. హెన్నా వేస్తామంటూ హిందూ మహిళలను వారు మభ్యపెట్టి లవ్ జిహాద్ మగ్గు లోకి లాగుతారని.. మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. అలాగే మేకప్, హెయిర్ స స్టైల్ వంటి పనుల కోసం దుకాణదారులు ముస్లిములను వినియోగించుకోరాదని మనోజ్ కోరారు.

యూపీతో బాటు మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, రాజస్థాన్, ఝార్ఖండ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండుగ విశేష ప్రాచుర్యంలో ఉంది. శ్రావణ మాసంలో శుక్ల పక్ష తృతీయ నాడు వచ్చే ఈ ఫెస్టివల్ సందర్భంగా హిందూ మహిళలంతా రోజంతా ఉపవాసం ఉండి శివ పార్వతులను పూజిస్తారు. తమ వైవాహిక జీవితం ఆనంద ప్రదంగా ఉండేట్టు చూడాలని కోరుతారు. అందుకే ఇలాంటి రాష్ట్రాల్లో ముస్లిములు కొందరు హిందూ మహిళలకు హెన్నా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.అయితే దీనికి కళ్లెం వేస్తూ.. యూపీలో క్రాంతిసేన అనే సంస్థ ఈ విధమైన ప్రచారం చేపట్టింది. లవ్ జిహాద్ వంటి సంఘటనలు పెరుగుతున్న దృష్ట్యా తామీ ప్రచారం చేపట్టామని వీరు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.