News

విజయవంతమైన నిర్భయ్ క్షిపణి ప్రయోగం.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన

669views

పూర్తి స్వదేశీ రూపొందించిన బూస్టర్‌ ఇంజిన్ అమర్చిన ‘నిర్భయ్‌’ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న పరీక్ష కేంద్రం నుంచి క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ప్రకటించింది. ఈ క్షిపణి 1000 కిమీల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా చేధించగలదు. బుధవారం ఉదయం పదింటికి క్షిపణిని ప్రయోగించగా 15 నిమిషాలపాటు గాల్లో దూసుకెళ్లి 100 కి.మీ.ల దూరంలోని నిర్దేశత లక్ష్యాన్ని ధ్వంసం చేసిందని డీఆర్‌డీవో పేర్కొంది.

తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా సరిహద్దుల్లో దీన్ని మోహరించే వ్రతిపాదనలం ఉన్నాయి. భూతల లక్ష్యాలను చేధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రయోగించే. క్రూయిజ్‌ క్షిపణి రకానికి చెందిన “నిర్భయ్‌” ఏకంగా 800 కేజీల పేలుడు పదార్దాలను మోసుకుపోగలదు. దాదాపు 0.7 మ్యాక్‌ స్పీడ్‌తో ఇది ప్రయాణిస్తుంది. అరు మీటర్ల పోడవు, 0.52 మీటర్‌ వెడల్పుండే ఈ క్షిపణిని గగనతల, సముద్ర, భూతలాల నుంచి ప్రయోగించవచ్చు. తొలి దశలో ఘన ఇంధనాన్ని తర్వాత ద్రవ ఇంధనాన్ని వాడుకునే మిస్సైల్‌ ఇది. జలాంతర్భాగంలో ప్రయాణించడంతోపాటు, అత్యంత తక్కువ ఎత్తుల్లో ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో దీని జాడను శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేవు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.