News

ప్రపంచ నాయకులారా! మా దేశ ప్రజల్ని కాపాడండి – ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్

167views

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లోని చాలా ప్రాంతాలపై నియంత్రణ సాధింస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో అనేక మంది దేశం నుండి పారిపోవలసి వచ్చింది. ఆ దేశంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రజలను అయోమయంలో ఉంచవద్దని, ప్రపంచ నాయకులు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. “ప్రియమైన ప్రపంచ నాయకులారా! నా దేశం గందరగోళంలో ఉంది, పిల్లలు మహిళలు సహా వేలాది మంది అమాయకులు, ప్రతిరోజూ మరణిస్తూ ఉన్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. మమ్మల్ని గందరగోళంలో ఉంచవద్దు. ఆఫ్ఘన్‌లను చంపడం మరియు ఆఫ్ఘనిస్తాన్‌ను నాశనం చేయడం ఆపండి. మాకు శాంతి కావాలి “అని ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల దాడులలో ఎంతో మంది అమాయకులు బలవుతూ ఉన్నారు. ఆ దేశంలో ఉండడం సురక్షితం కాదని ఇప్పటికే చాలా దేశాలు ఆయా దేశాల ప్రజలకు, దౌత్య వేత్తలకు సూచించాయి. తాలిబాన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా వెళ్లిపోయే రోజులు ఏమంత దూరంలో లేవని తెలుస్తోంది.

Source : Nationalist Hub

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.