NewsSeva

నిరంతర సేవా స్రవంతి సేవాభారతి

1kviews

డచిన మూడున్నర దశాబ్దాలుగా సేవాభారతి సంస్థ దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజయవాడ కేంద్రంగా రాష్ట్రమంతటా సేవాభారతి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో సేవాభారతి – ఆంధ్ర ప్రదేశ్ అన్ని విధాలుగా బాధితులకు, ఇతర పేద వర్గాల ప్రజలకు బాసటగా నిలిచింది.

సేవాభారతి రక్తదాన శిబిరం

సేవాభారతి కాల్ సెంటర్

ఆయుష్64 కిట్ల పంపిణీ

రేషన్ కిట్ల వితరణ

కరోనా నివారణ, చికిత్సలలో భాగంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వారిచే పంపబడిన ఆయుష్ 64 కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10000ల మంది కరోనా పీడితులకు సేవా భారతి అందజేసింది. అవసరమైనవారికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. అంబులెన్స్ సేవలను, మృతదేహాల తరలింపుకు అంతిమయాత్రా రథ సేవలను కూడా సేవా భారతి అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఐసొలేషన్ కేంద్రాలను కూడా సేవా భారతి నిర్వహించింది. వివిధ ఆసుపత్రులలో కరోనా చికిత్స అందుకుంటున్న బాధితులకు, హోమ్ ఐసొలేషన్ లో ఉన్న బాధితులకు ఆహారము, త్రాగునీరు, పండ్లు వంటి వాటిని అందజేసింది.

ఆహార పొట్లాలు, మంచినీళ్ళ వితరణ

సేవాభారతి కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు

ఆంబులెన్స్, అంతిమ యాత్రా రథాలను ప్రారంభిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్

లాక్ డౌన్ సమయంలో వృత్తి వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయులు, వివిధ చేతివృత్తుల వారు, దినసరి కూలీలు, దివ్యాంగులు, అర్చకులు తదితరులకు రేషన్ కిట్లను అందజేసింది. అలాగే కరోనా నివారణ, చికిత్సలో గణనీయమైన పాత్రను పోషించిన ఆనందయ్య ఔషధాన్ని, కషాయం కాచుకునేందుకు వీలుగా వివిధ వనమూలికలు, దినుసులతో చేయబడిన కషాయం పొడి ప్యాకెట్లను కూడా వేలాది మందికి అందజేసింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులను కూడా సేవా భారతి అక్కున చేర్చుకుంది.

కరోనా సంక్షోభ సమయంలో సేవా భారతి చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలు, వాటి లబ్ధిదారుల సంఖ్యా వివరాలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

అనేక వ్యయ ప్రయాసలకోర్చి నిరంతరంగా, నిరుపమానంగా తన సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తూ వస్తున్నది సేవాభారతి. ఈ సేవా యజ్ఞంలో భాగం కావాలనుకునేవారికి, సమిధల్ని వెయ్యాలనుకునేవారికి తమ వంతు సాయం, సహకారం అందించే అవకాశం ఎప్పుడూ ఉంది. కనుక ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వాములు కాదలచుకున్న వారెవరైనా వివరములకు ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చు.

సేవా భారతి,

మాధవ సదన్,

29 – 13 – 4/1,

కాళేశ్వర్రావు రోడ్డు,

గవర్నర్ పేట,

విజయవాడ – 520002,

ఫోన్ : 9440518837.

బ్యాంకు అకౌంట్ వివరములు :

NAME:  SEVABHARATI  (CURRENT ACCOUNT)

AC NO : 510101005538218

BANK-:  UNION BANK OF INDIA,

BRANCH:  S.N.PURAM,  IFSC COAD : UBIN0902039

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.